ATP: జనగణన స్వీయ గణనపై అవగాహన పెంచేందుకు ఈ నెల 26న అనంతపురం నగరంలో ‘సెన్సెస్ 5కే రన్’ నిర్వహించనున్నట్లు జిల్లా సెన్సెస్ అధికారి మలోల తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమయ్యే ఈ పరుగు టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా సాగి తిరిగి కళాశాల వద్దే ముగుస్తుందని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.