SKLM: అరసవల్లి గ్రామ దేవత అసిరితల్లి సిరిమానోత్సవం నేపథ్యంలో ఈనెల 28న మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సూర్య నారాయణస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో ప్రసాద్ తెలిపారు. ఉత్సవం ముగిసిన తర్వాత మాడ వీధులను శుభ్రం చేశాక సాయంత్రం 5 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.