KMM: జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ షాక్ ఇచ్చింది. రవి, షాలోమ్, హీరా, శ్రీరామ విద్యా లయాలకు గుర్తింపు లేనందున వాటిని తక్షణమే మూసివేయాలని డీఈవో చైతన్య జైనీ శుక్రవారం ఆదేశించారు. ఎంఈఓలు సదరు పాఠశాలలను మూసివేసి, రికార్డులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అనుమతి లేని విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పించవద్దన్నారు.