WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన నల్లపు నారాయణ (80) మృతి చెందగా, ఆయన కూతురు స్వరూప తండ్రి ఆశయాన్ని నెరవేర్చుతూ దేహదానం చేశారు. నారాయణ గతంలోనే దేహదాన అంగీకార పత్రం రాసి ఇవ్వడంతో తెలంగాణ నేత్ర, అవయవ, శరీరదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాల అనాటమీ విభాగానికి తరలించారు.