MDK: జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ శుక్రవారం ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఔషధ నిల్వ గదిని పరిశీలించి, ముఖ్యంగా ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలపై ఆరా తీశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో హీట్ స్ట్రోక్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు.