KRNL: కల్లూరు అర్బన్ పరిధిలో శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు భూమిపూజలు నిర్వహించారు. 35వ వార్డులో గోడల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రూ.30 లక్షలతో లే అవుట్లో WBM రోడ్డు, 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో అంగన్వాడి కేంద్రం వద్ద రూ.60 లక్షలతో డ్రెయినేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో యువ నేత గౌరు జనార్దన్ రెడ్డి ఉన్నారు.