TG: సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లో ఆర్టీసీ దేశంలోనే ప్రజా రవాణాలో ముందుండాలన్నారు. ఆర్టీసీలో సమస్యలపై, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే పలు అంశాలపై మాట్లాడినట్లు వెల్లడించారు.