SRPT: కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా డిపో వద్ద శాంతియుత వాతావరణం నెలకొనేలా సహకరించిన పోలీస్ సిబ్బందిని శనివారం రాత్రి కార్మికులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి స్వీట్లు పంచి అభినందించారు. సమ్మె సమయంలో పోలీసులు చూపిన సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.