AP: ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలని.. సమస్య చక్కదిద్దేందుకు టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి బంక్ దగ్గర రెవెన్యూ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్లో అమ్మకూడదని.. రేపటికల్లా ఎక్కడా నోస్టాక్ బోర్డులు కనిపించకూడదన్నారు.