SDPT: కాంగ్రెస్ పార్టీ గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా వీరాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ పనులు మొదలయ్యాయి. కార్యక్రమంలో సర్పంచ్ చిలుముల సతీష్, ఒగ్గు దామోదర్, ముక్కిస రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.