MDK: తపాన్ మండలంలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో బంకులు మూతపడ్డాయి. ఇప్పటికే మండలంలో డీజిల్ నిల్వలు నిండుకోగా, ఒకటి రెండు బంకుల్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. రాత్రికి అది కూడా అయిపోతుందనే ప్రచారంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు.