MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఎంఎస్సీ, ఎం.ఫార్మసీ విద్యార్థుల కోసం సోమవారం క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు 78 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అర్జున్ కుమార్ తెలిపారు. హెచ్ఆర్ రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ సాగిందని, ఫలితాలను నెల రోజుల్లో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.