NRPT: ఊట్కూర్ మండలం సమిస్తాపూర్ పెద్దవాగు ఒడ్డున ఉన్న శంకర్ లింగేశ్వర స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా పులిమామిడికి చెందిన వ్యాపారి నామాల రఘు తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.50,000 విరాళాన్ని సోమవారం కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని విరాళాలు అందించాలని కమిటీ సభ్యులు భక్తులను కోరారు.