BHNG: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి హిందూ దేశంగా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బాలరాజు పిలుపునిచ్చారు. ఆదివారం మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన సీపీఎం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, పెరిగిన ధరలు, ఆర్థిక ఇబ్బందులను పక్కదోవ పట్టేస్తోందని విమర్శించారు.