HNK: హనుమకొండ పట్టణంలోని కలెక్టరేట్ బంగ్లాను హెరిటేజ్ భవనంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1886లో సుబేదార్ నివాసంగా నిర్మితమైన ఈ చారిత్రక భవనం పునరుద్ధరణకు రూ.2 కోట్లు కేటాయించారు. ప్రధాన గడియారం, పాత నిర్మాణ శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 13 ఎకరాల్లో హెరిటేజ్ కేంద్రంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు.