MDK: జిల్లాలో ఏప్రిల్ 27 నుంచి మే 2వ తేదీ వరకు ‘బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణ, గంజాయి వంటి వాటి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.