ఐపీఎల్-2026లో భాగంగా రేపు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గాయం నుంచి ఇంకా కోలుకోని RCB ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్కు కూడా దూరం కానున్నాడు. ఈ సీజన్లో DCతో జరిగిన తొలి మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని RCB పట్టుదలతో ఉంది.