MHBD: చిన్నగూడూర్ మండలం మేగ్య తండా గ్రామ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైతు భూక్యా బాషు నాయక్‌కు చెందిన 10 ఎకరాల జామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైంది. పక్క పొలంలో మొక్కజొన్న చెత్త తగలబెట్టడంతో మంటలు వ్యాపించి తోటను చుట్టుముట్టాయి. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షల నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపారు.