AP: మంగళగిరిలో ఏర్పాటు చేసిన IPL ఫ్యాన్ పార్క్‌కు రెండో రోజు అభిమానులు పోటెత్తారు. మంత్రి లోకేష్ చొరవతో టిడ్కో మెగా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ పార్క్ క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ LED స్క్రీన్లపై మ్యాచ్‌లను వీక్షిస్తూ స్టేడియం తరహా అనుభూతిని పొందుతున్నారు. ఈ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.