PDPL: సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎనిమిది జట్లతో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ పోటీలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఆయన బ్యాట్ పట్టి కాసేపు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని నింపుతాయన్నారు.