SRCL: వేములవాడ ఆర్టీసీ సమ్మె విరమణ, ప్రభుత్వంతో చర్చలు ఫలవంతమైన నేపథ్యంలో డిపో కార్మికులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆది శ్రీనివాస్ కార్మికులకు స్వయంగా స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అన్నారు.