SRPT: మేడే ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని పరిశ్రమలకు ఉత్తమ యాజమాన్య అవార్డులు అందించనున్నట్లు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మిక సంక్షేమం, భద్రత, మహిళా పథకాలు, స్థానిక ఉపాధి కల్పనలో రాణించిన సంస్థలకు ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 27లోగా కార్మిక శాఖ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలన్నారు.