BDK: కొత్తగూడెం నియోజవర్గానికి మరో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రికార్డు స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటి ఏర్పాటుతో రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో తేవాలని అన్నారు.