KMR: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం KMRలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 200 మంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్లపై రాజధాని పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే వారి డిప్యూటేషన్లను రద్దు చేసి బదిలీలు చేపట్టాలని సూచించారు.