JGL: కథలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఎంపికకు శుక్రవారం దరఖాస్తుదారులకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కథలాపూర్ మండలంలో 17 యూనిట్లు ఉండగా.. 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూకు 36 మంది హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎంపీడీవో శంకర్ తెలిపారు.