KMR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా IDOCలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. యువత నైపుణ్యాలు పెంచుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. SC కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొని శిక్షణ, ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించారు.