KRNL: ఆదోని పట్టణ తాగునీటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఇంజినీర్ సత్యనారాయణరావు ఇవాళ ట్యాప్ ఇన్స్పెక్టర్ ఈరన్న, ఫిట్టర్ వీరేష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.