KKD: పెద్దాపురం మండలం పులిమేరు గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా పెద్దాపురం తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ పాలనలో వెలితి ఏర్పడిన నేపథ్యంలో పై అధికారులు ఆమెను ప్రత్యేక అధికారిగా నియమించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.