SDPT: హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. ప్రాణ త్యాగం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కు కార్మికులు నివాళులర్పించి నినాదాలు చేశారు. శంకర్ కుటుంబానికి తమ వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కార్మికులు వెల్లడించారు. డిపో నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.