KNR: వరంగల్ జిల్లా మహేశ్వరం వద్ద కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా.. భద్రత దృష్ట్యా కాన్వాయ్‌ను నిలిపివేశారు. పోలీసుల తీరుపై సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాళులర్పించేందుకు వెళ్తే ఇబ్బందేంటని ప్రశ్నించారు.