VKB: కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని హైకోర్టు తీర్పుతో స్పష్టత వచ్చినట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ గౌడ్ తెలిపారు. దోమ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ విధానం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు.