కోనసీమ: సాక్షులను బెదిరించి ప్రలోభపెట్టి బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్ట్ చేయాలని నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పి.గన్నవరం కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు టీడీపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.