TG: RTC కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన RTC ఉద్యోగిని HYDకి షిఫ్ట్ చేశామని వెల్లడించారు. అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని, చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులని చెప్పారు.