KMM: కూసుమంచి మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా తెరదించారు. గురువాయి గూడెంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించి ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.