SRPT: జిల్లాలో ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెలో భాగంగా గురువారం రెండవ రోజు సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ డిపో ముందు కార్మికులు, ఉద్యోగులు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని అమలు చేయాలని కార్మికులు కోరారు. కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలన్నారు.