BPT: రేపల్లె సబ్‌జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారీ ఘటనలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తెనాలి వన్‌టౌన్ పీఎస్ కేసులో అజిత్ ఇక్కడ రిమాండ్‌లో ఉన్నాడు. అనారోగ్యం సాకుతో అతడిని జీజీహెచ్‌కు తరలించి, పరారయ్యేందుకు సూపరింటెండెంట్ సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో ఆయనపై శాఖాపరమైన వేటు పడింది.