AP: వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై మంత్రి డీఎస్బీవీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సత్యనారాయణ అని పేరు పెట్టుకుని అసత్యాలు మాట్లాడటం సిగ్గుచేటు. వైసీపీ పాలనలో అవినీతి తప్ప.. అభివృద్ధి శూన్యం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. ఐదేళ్లు చేసిన మోసాలకే ప్రజలు వైసీపీని క్రికెట్ టీం(11)కి పరిమితం చేశారు’ అని విమర్శించారు.