TG: HYDలోని గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. 76 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సౌకర్యాలు కల్పించనున్నారు. స్టేడియం సామర్థ్యాన్ని 50 వేలకు పెంచి, అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. 12 ఎకరాలను కమర్షియల్ ప్రయోజనాల కోసం కేటాయించి, ఆ ఆదాయాన్ని క్రీడాకారుల శిక్షణ, వసతి కోసం వినియోగిస్తారు.