NLG: డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1,3,5 సెమిస్టర్ విద్యార్థులకు ఈనెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కళాశాల నల్గొండ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ప్రాక్టికల్ పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయన్నారు. సందేహాలుంటే స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు.