AP: కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలనా విధానాలు, ఉత్తమ పాలనా పద్ధతులు అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం వెల్లడించింది.