200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సుదర్శన్‌ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఈ సీజన్లో ఎట్టకేలకు బుమ్రాకు తొలి వికెట్ దక్కింది. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్‌ను కెప్టెన్ పాండ్యా LBWగా వెనక్కి పంపాడు. దీంతో కేవలం 5 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి GT కష్టాల్లో పడింది.