PDPL: 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని BMS అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సింగరేణి RG 1 పరిధిలోని GDK 2వ గని వద్ద సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 1 నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్త పోరాటాలకు పిలుపునిచ్చారు.