HNK: పట్టణ కేంద్రంలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రొ. గుర్రపు శ్రీనివాస్ దోస్త్ ఆన్లైన్ సెంటర్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.