ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ పిచ్‌పై 160-170 పరుగులు చేయడమే చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకపోవడం వల్లే ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ సాధించిందని పేర్కొన్నాడు. ఈ ఓటమిని సమస్యగా చూడదలుచుకోలేదని తెలిపాడు. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు.