MNCL: ఉపాధి హామీ కూలీలు పనులను చేసుకోవాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఈజీఎస్ ఏపీవో రవీందర్ సూచించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామా శివారులలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను వారు పరిశీలించారు. ఎండల నేపథ్యంలో పని స్థలాల్లో కూలీల టెంట్ సౌకర్యంతో పాటు తాగునీటిని అందుబాటులో ఉంచామన్నారు. ప్రతికూలి రోజువారీ వేతనం రూ.307 వచ్చేలా పని చేసుకోవాలని వారు కోరారు.