MDK: చేగుంట మండలం పొలంపల్లి పెద్ద చెరువు ఉపాధి హామీ పనులను సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా ఉదయమే పనులను చేపట్టి త్వరగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. ఉపాధి పనుల వద్ద తాగునీటి వసతి, ఆశా వర్కర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వార్డు సభ్యులు యాట మౌనిక, టిఏ ముత్యాలు, మేట్ కొండి ప్రదీప్ కుమార్, కూలీలు పాల్గొన్నారు.