NZB: జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వా రెడ్డికి వీడ్కోలు సన్మాన సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు NZB పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఈ సందర్భంగా ఎన్ఎస్సీ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వీడ్కోలు సభను విజయవంతం చేయాలని కోరారు.