BHNG: రాయగిరి గుట్టల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు స్తంభోద్భవుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. సదరు ఆకృతి అచ్చంగా నారసింహుడి దివ్య మనోహర స్వరూపాన్ని పోలి ఉంది. తిరుమల కొండల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపమైన అనంత శయనం, గరుడ పక్షి ఆకారం మాదిరిగానే యాదగిరిగుట్టలో సైతం శాంత నారసింహుడు అవతరించారు.