HNK: దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక చాపర్తి సాత్విక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుంచి ఇంటి వద్ద కనిపించకపోవడంతో తల్లి చాపర్తి కోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దామెర SI కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వివరాలు తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలన్నారు.