NRML: సోన్ మండలంలో గోదావరి నదిలో వ్యర్థాల సమస్య పెరుగుతోంది. నదికి వచ్చే భక్తులు పూజా సామగ్రి, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు నదిలో వేయడం వల్ల కాలుష్యం ఎక్కువవుతోంది. దీని ప్రభావం నీటి నాణ్యతపై పడుతూ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు భక్తులు బాధ్యతగా వ్యవహరించాలని, అధికారులు శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.